వెలుగులు (గజల్) : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం.


ఇల్లాలు తిరుగుతుంటే ఇంటికే వెలుగురా 
పిల్లలూ ఆడుతుంటే కంటికే వెలుగురా  

విహారానికి పిలుస్తూ వెన్నెలను చల్లుతూ  
జాబిలి చరిస్తుంటే మింటికే వెలుగురా 

పకపకా నవ్వుతూ పసిపాప నోరు తెరుస్తూ  
తళతళా లాడుతుంటే పంటికే వెలుగురా 

అందాలు చూపుతూ ఆనందం కలిగిస్తూ 
మిలమిలా మెరుస్తుంటే వంటికే వెలుగురా 

గలగలా మాట్లాడుతూ చిరుగంతులు వేస్తూ 
నవ్వులూ చిందుతుంటే చంటికే వెలుగురా 

అమ్మ ప్రేమ చల్లగా ఇల్లంతా నింపితే   
ఆప్యాయతల సౌరభం గూటికే వెలుగురా॥  

సత్యమనే మాటలను మనసారా పలికితే   
మంచితనపు మాధుర్యం నోటికే వెలుగురా॥ 

కామెంట్‌లు