రాకెట్ యుగానికిచేరిన
మానవ జీవన విధానం !
ఐనా...!
మారని బతుకులు...
తీరని వెతలు...!!
పొయ్యి మీదికే కాదు...
పొయ్యి కిందికి యాతనె
దంచిన బియ్యం బుక్కిన కాడికె సాలవు అన్నట్టు...
ఎంత రెక్కలు ముక్కలు సేసు కున్నా...
యే రోజు దారోజుకె..!
పొయ్యి మీది కయిందను కుంతే...
పోయ్యి కింది కట్టెల కోసం....ఇంటి నుంచి అడివికి మూడు కోసుల తోవ...
మొయ్య గలిగి నన్ని కర్రలూ మూడు రోజులకే!
అసలే వానా కాలం....
కర్ర ముక్కలు తడిసి పొతే...
కంట నీరు, కళ్లు మంట లు తప్ప...
వంట అవ్వదు కదా...!
అందుకే ... ఒర్షమ్ తెరిపిచ్చి నప్పుడే...
ఒచ్చే కూలి డబ్బులు పోయినా....కర్ర పుల్లల కోసం ఈ పాట్లు...!
కాల మెంత మారిన...
తెలివి, బలముఉన్నోల
బతుకు లెంత బాగు పడిన...
ఇంకా... ఇలాటి బతుకులు ఎన్నెన్నో..!
ప్రభుత్వాలు ఎన్నెన్ని పధకాలు పెడుతున్నా
ఎంతె0త సహక రిస్తున్నా...
దారిద్ర్య రేఖకు దిగువ నున్న వారు పైకి రాలేరా!?
యే మీ కారణం...?!
ఏ మి టి పరిష్కారం !?
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి