ధర్మమౌ జీవనము. (ఇష్టపది ): - టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.


రక్తసంబంధమే రక్షణగ నిల్చునది.
బంధుబలగంబెపుడు బాసటగ మెల్గునది.

తల్లిదండ్రుల ప్రేమ తనువునే నిల్పునది.
భార్య నిరతమ్ము సగ భాగమై బ్రతుకునది.

తోబుట్టువుల తోడు తోషమును పెంచునది.
పిల్లపాపల యాట వేడుకలు తెచ్చునది.

సాధుగుణ వర్తనము సౌభాగ్య మిచ్చునది.
ప్రకృతియారాధనము పరమోత్తమమయినది.

ధర్మమౌ జీవనము తరియింప చేయునది.
పరమాత్మ సేవ సత్పథము చూపించునది.//

కామెంట్‌లు