ఎర్రని బీట్ రూట్ మొహంతో కొంచెం కోపంగా కనిపిస్తోంది కదూ ఈ పిల్లను బడిలో మాస్టర్ కొట్టినట్లు ఉన్నాడు అందుకే స్కూలుకు ఎగ్గొడుతోంది వాళ్ళమ్మ గట్టిగా కోప్పడేసరికి మొహం కందగడ్డగా పెట్టుకున్నది ఎవరైనా కోపంతో ఉంటే మొహం కందగడ్డ లా ఉంది అంటారు కదా కానీ ఈ పాప మొహం బీట్రూట్ ల పెట్టుకుంది ఇది ఒక కూరగాయ దీని శాస్త్రీయ నామం బీటా వల్గారిస్ ఇది కినో పొడి యేని కుటుంబానికి చెందిన దుంప మొక్క ఈ దుంపలు వేళ్ల రూపాంతరాలు వేర్లు ఆహారాన్ని దాచి పెట్టుకోవడానికి లావుగా తయారవుతాయి వీటిని చక్కెర తయారీలో కూడా వాడుతారు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి పువ్వులు ఆకుపచ్చగా కానీ కొద్ది ఎరుపుగా కానీ ఉంటాయి పూలకు 5 రెక్కలు ఉంటాయి కాయలు గట్టి గింజల ఉంటాయి ప్రాచీన గ్రీకులు రోమన్లు కూరలుగా వాడుకున్నారు దీని పుట్టినిల్లు ఐరోపా లోని మధ్యధరా ప్రాంతం గత రెండువేల సంవత్సరాలుగా వీటిని కూరలలో ఉపయోగిస్తున్నారు.
బీట్రూట్ మొహం అనుకున్నాం కదా దోసకాయ దేహంతో క్యారెట్ల చేతులతో కరివేపాకు వేళ్ళతో తయారయ్యింది చిన్నది ఈ పిల్లకు బెండకాయల గౌను కుట్టాను బెండకాయల్ని లేడీ ఫింగర్స్ అంటారు కదా అని లేడీ కి గనుక కుట్టేసాను పాలకూర జుట్టును పెట్టాను జుట్టుకు రంగులేసుకోవడం ఫ్యాషన్ కదా ఆకుపచ్చ రంగు జుట్టు పెట్టాను కళ్ళ కోసం ఒక్కల్ని పెట్టాను కానీ కోపంలో కనిపించడం లేదు సరే మా బిందును ఆశీర్వదించండి స్కూల్ కి వెళ్ళమని చెప్పండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి