నిద్ర!: - - యామిజాల జగదీశ్


 అవును, నిజంగానే ఇలాంటి ఉద్యోగం ఒకటి ఉంది!
2022లో మలేషియాకు చెందిన 'సోన్నో' అనే పరుపుల తయారీ సంస్థ అందరినీ ఆకట్టుకునేలా "స్లీప్ ఇంటర్న్‌షిప్" పేరుతో వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి పని కేవలం నిద్రపోవడం మాత్రమే కాదు. వివిధ రకాల పరుపులపై పడుకుని, నిద్ర నాణ్యత వివరాలు, అనుభవం ఎలా ఉందో నమోదు చేసి అందించాలి.
ఈ కార్యక్రమం ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడానికి, అద్దాల గోడలతో ఉన్న ఒక చిన్న మొబైల్ బెడ్‌రూమ్‌ను లారీపై ఏర్పాటు చేసి కౌలాలంపూర్ నగరం అంతటా తిప్పారు. ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటూ, నిద్రపోతున్న వ్యక్తిని ప్రజలు నేరుగా చూడగలిగారు.
"నిద్రపోతే జీతం" అనే ప్రచారమే కాకుండా, పరుపుల నాణ్యతను పరీక్షించి, నిద్ర అనుభవాన్ని నమోదు చేస్తూ తమ ఉత్పత్తులను ప్రజలకు చేరవేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.
కామెంట్‌లు