పురాణాల్లో వనాలు!: - అచ్యుతునిరాజ్యశ్రీ

 మనపురాణాలలో వనాలు అడవులు ఋషుల ఆశ్రమాలతో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా విలసిల్లాయి. రామాయణంలో దండకారణ్యం, కృష్ణుని మధువనం తో పాటు కామ్యకవనం మహాభారతంలో ప్రసిద్ధి చెందింది.పాండవుల వనవాసం ఇక్కడే.సరస్వతీనదిఒడ్డున అర్జునుడు భీముడు ధైర్య సాహసాలు ప్రదర్శించడం జరిగింది.నేటి రాజస్థాన్ హర్యానా సరిహద్దుల్లో

ఉండేవనం అని కొందరు, హనుమాన్ గఢ్ ,శ్రీగంగానగర్, కురుక్షేత్రం కలిసిన ప్రాంతమని పురాతత్వశాస్త్రవేత్తల అభిప్రాయం.రకరకాల ఫలాలు,ఓషధీమొక్కలనిలయం, సదా జలసమృద్ధం కలిగిన ప్రాంతం కాబట్టే  పాండవులున్నారని  చరిత్ర చెప్తోంది.నాగరికత కేవలం రాజమహల్లోనేకాదు, జ్ఞానం దైవం వనాల్లోనే దర్శనీయం అని అందరి అభిప్రాయం.ధర్మ రాజు జూదంలో అంతా పోగొట్టుకున్నాకూడా సరస్వతీతీరంలో నివాసముండి సత్సాంగత్యంలో గడిపాడు. మరినేడు సరస్వతీనది వనాలు మాయం ఐనాయి.ఉన్న జలాలు అడవుల్ని మనం కాపాడకపోతే ఓ 50ఏళ్లతర్వాత  మనకున్న నదులు కనపడక మాయం అయ్యే ప్రమాదం ఉంది.ఖడ్గమృగం ఒక కొమ్ము ఉన్న ప్రాణి అస్సాం రాష్ట్ర జంతువు.విశ్వకర్మ  దాన్ని ఎలాతయారు చేశాడో తెలుసా? ఏనుగు చర్మం గుర్రం గిట్టలు,మొసలికళ్లు, ఎలుగుబంటి మస్తిష్కం,సింహం హృదయం, వృషభం కొమ్ము ..ఇలా అన్నింటినీ కల్పి ఖడ్గమృగాన్ని సృష్టించాడని జానపదకథలు చెప్తున్నాయి. దాదాపు 5వేల ఏళ్ల క్రితం హరప్పా నాగరికత కి సంబంధించిన  అనేక నాణాలపై  ఈజంతువుచిత్రం ఉంది.ఋగ్వేదంలో ఖడ్గ  అనే జంతువు ప్రస్తావన ఉంది.అర్జునుడి గాండీవం అనేపదంకి గండక్ (ఖడ్గ మృగం) తో సంబంధం ఉంది అంటారు.దాని చర్మం మొద్దుగా ఉంటుంది కాబట్టి యోధుల వస్త్రాలు తయారుచేసేవారు.భగవద్గీత లో  ఏకశృంగ అనేపదం ఉంది.
జైనమతంలో కూడా 11వ తీర్థంకరుడు శ్రేయాంస్ నాధ్ కి ప్రతీక గా భావిస్తారు.బౌద్ధ  *ఖగ్గవిసాణ సుత్తలో ఇలా చెప్పబడింది.ఏకాంతవాసి బౌద్ధ భిక్షువు ఖడ్గ మృగం కొమ్ముతో పోల్చారు. ఇంద్రియ నిగ్రహంతో సత్యం పలుకుతూ ఖడ్గ మృగంలాగా ఒంటరిగా తిరుగు.గుజరాత్ లోని గ్రామ దేవత  ధావడీమాత  వాహనం ఖడ్గ మృగం.పాకిస్తాన్ లోని సంచార జాతుల వారు ధావడీమాతను కొలుస్తారు.దాని మాంసాన్ని  అర్పిస్తే కానీ  పాండురాజుకి స్వర్గప్రాప్తి కలగదని  ఓదివ్యఖడ్గమృగాన్ని వేటాడారు.అది పాండవులకి  ఇంద్రలోకంలో దొరికింది. సారలాదాస్  రాసిన  ఒడిషా మహాభారతం ప్రకారం ఖడ్గ మృగం శివునితోటలో తిరుగుతుంటే అర్జునుడు దాన్ని వేటాడాడు.ఆతోట కాపలాదారుడు అర్జునుడి పుత్రుడు!  అతని తల్లి నాగకన్య. అతనిపేరు నాగార్జునుడు చాలాచోట్ల పూజలందుకుఅంటాడు🌹
కామెంట్‌లు