చిత్రమైన కూరగాయ
ఆకు,పిందె,కాయ, పండు
పులుపు రుచికి సత్రకాయ !!
దట్టమైన చింత తోపు
చిట్టి పొట్టి ఆటచూపు
దిట్టమైన ఆదాయము
పట్టియిచ్చి చింత బాపు!!
పులిహోరకు చింతపులుసు
కలిపేస్తే నిండు మనసు
మలిరోజుకు మహారుచిగ
సులువైనది వంటదినుసు!!
పాతచింతకాయ తొక్కు
బాలింతకు జిహ్వ చిక్కు
తాలింపుకు వీధి వీధి
తొంగిచూచి చాల నిక్కు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి