శ్రీరాముని అడవులకు పంపెను
అతని వెంట సీతా లక్ష్మణులు గూడా వెళ్ళినారు
మిక్కిలి ఖ్యాతిగాంచిన ఆ మహారాజు
ప్రియపుత్రుడైన శ్రీరాముడు దూరమగుట వలన
పుత్రశోకముతో మిక్కిలి దుఃఖించెను
అతని ఎడబాటు తట్టుకోలేక స్వర్గస్తుడాయెను
రాజనీతిజ్ఞుడవైన ఓ భరతా! నీ కొరకై
ఈ కార్యమును నేను నిర్వహించితిని
నీవు మహారాజ పదవిని చేపట్టుము
నీ తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను
ఓ పుత్రా! నీవు శోకతాపములను వీడుము
నీలో ధైర్యమును వహింపుము
ఈ కోసల రాజ్యమునకు నీవే రాజువు
నాయనా! భరతా! నా మాటలను వినుము
అన్ని తెలిసిన వసిష్ట మహర్షి తో బ్రాహ్మణులతో గూడి
సాటిలేని పరాక్రమశాలియైన మీ తండ్రి
అంత్యసంస్కారములను చేయుము
వెంటనే కోసలరాజ్యసింహాసనమున పట్టాభిసిక్తుడవుకమ్ము."
=====================================
అయోధ్యకాండ నందు 72వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి