వాకిట ముగ్గును చెరిపింది
పిల్లల తనువులు తడిపింది
గొడుగుకు చలనం తెచ్చింది!
కాగితాలయ్యాయి పడవలు
కాళ్లతో నీటిలో తపతపలు
నీటి గుంటల్లోన చిందులు
మిన్నంటెనులే కేరింతలు!
చేరిరంతా చెట్టు నీడన
ఊపారు కొమ్మను వేగాన
చినుకులు రాలెను తలపైన
ప్రకృతి ఇచ్చెను నజరానా!
ఆకాశాన రంగుల హరివిల్లు
తెచ్చెను చినుకుల జల్లు
ప్రకృతి అంతా శోభిల్లు
పచ్చదనముతో రంజిల్లు!
తడిసెను పిల్లల తలలు
కొంగుతో తుడిచెను తల్లులు
ఆగని పిల్లల తుమ్ములు
పట్టెను నీటి ఆవిరులు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి