తెలుగు భాష ప్రజ్వలిత పురస్కారాలు ప్రదానం*

 ఐ.యస్.ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ శుభాకాంక్షలుతో శ్రీకాకుళంలో  డా .యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో ముందస్తు  తెలుగు భాష దినోత్సవం సంబరాలు  ఆదివారం   ఆగష్టు 16 తేదీ ప్రథమ శాఖ గ్రంథాలయము నియర్ థామ్సన్ రోడ్  వద్ద  నిర్వహించడము జరిగింది.. విభిన్న రంగాల్లో సేవలు చేసిన కవులు  కళాకారులను  భాష ప్రేమికులను   మరియు నృత్య కళాకారును తెలుగు భాష ప్రజ్వలిత సేవా పురస్కారంతో అతిథులుగా  విచ్చేసిన డా .యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు డా. పైడి సింధూర ప్రముఖ డాక్టరు గారు జి . ఇందిరా ప్రసాదు గారు ప్రముఖ కవి సేవకులు భోగల ఉమామహేశ్వర రావు  ప్రముఖ న్యాయవాది మరియు సోడవరము ఈశ్వర్ రావు సంఘసేవకులు శ్రీకాకుళం అధ్యక్షులు శ్రీ గుత్తావిల్లి శ్రీనివాస్  రావు శ్రీ తాళ్లూరి విజయలక్ష్మణ్ నాట్యగురువు శ్రీ తేజ గారు చేతులు మీదుగా  *తెలుగు భాష సేవా ప్రజ్వలిత పురస్కారం సర్టిఫికెట్టుతో అవార్డు గ్రహీతలకు సత్కారం చేయడము జరిగింది.. పిల్లలుతో తెలుగు భాష మీద సంప్రదాయ  నృత్య సంబరాలును  కవి సమ్మేళనంను ఘనముగా నిర్వహించడం జరిగింది 
 కవులు కళాకారులు సంఘసేవకులు అందరూ   సభను విజయవంతము చేసినందులకు  కార్యక్రమం  నిర్వాహకులు డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు  అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు