భరతుడు తన తండ్రి గూర్చి కైకేయిని అడుగుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


"ఓ తల్లీ! సుఖవాహనమైనటువంటి 
నీ బంగారుతల్పముపై తండ్రి లేకుండా 
శూన్యాతిశూన్యముగా  యున్నదేమి?
పురజానులెల్లరు సంతోషముగా లేరేమి?

తండ్రి దశరథ మహారాజు నీభవనమున
ఎక్కువగా నివసించువాడు గదా?
నేనతనిని చూచుటకై ఇటు వచ్చితిని 
అతడు ఇక్కడ గూడా కనబడడేమి? 

మా తండ్రి ఎక్కడున్నాడో తెలుపుము 
ఆయన పాదములకు నమస్కరించెదను
మా పెత్తల్లి కౌసల్యాదేవి ఇంట్లో ఉన్నాడేమో!
ఏమీ తెలియని భరతునికి కైకేయి ఇలా తెలుపును 

నాయనా! భరతా! నీ తండ్రి దశరథుడు
గొప్ప మహాత్ముడు, ధర్మాత్ముడు 
పరాక్రమశాలి, యజ్ఞచరణ శీలుడు 
సత్పురుషుల పాలిట పెన్నిధి అతడు 

సమస్త ప్రాణులు పొందే పరమగతియే 
మీ తండ్రియైన మహారాజుకు ప్రాప్తించెను 
తల్లి పలికిన ఆ ఘోరవచనములను విని 
దారుణమైన శోకముతో నేలపై పడెను.

కామెంట్‌లు