ఒంటరిగా ఉన్నప్పుడుఆలోచనలో...జనసమూహంలో ఉన్నప్పుడు, మాటల్లో...మరింత శ్రద్ధ అవసరం!తప్పు చేసేది కలమే అయినా,నలిగిపోయేది కాగితమే...!కొన్నిసార్లుజీవితం ఇలాగే ఉంటుంది!
కఠినమైన మాటలను చెవులు వింటాయి...వాటిని జీర్ణించుకునే హృదయాలే బరువెక్కిపోతాయి!నిఘంటువులో ఇమడలేని అర్థాలున్న మాటలు... పర్వాలేదు... ఏమీ కాదు...!బాధపెట్టడానికి ఎవరూ లేరని నేను ఒంటరితనాన్ని ఎంచుకోలేదు...!ఇకపై బాధపడటానికి నా శరీరంలో, మనసులో చోటు లేక ఒంటరితనాన్ని ఎంచుకున్నాను...!"ప్రతి మనిషి రెండు కథలతో బ్రతుకుతాడు"ఒకటి, తను బ్రతికే కథ,మరొకటి, తను బ్రతుకుతున్నానని అనుకునే కథ...!!మన సొంత మనసుమనం కోరుకున్నట్లు పనిచేయనప్పుడు...ఇతరులు మీ మనసుకు అనుగుణంగా పనిచేయడం లేదని కోప్పడటంలో అర్థం ఏమిటి...?!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి