ఆరోగ్యసూత్రములు.: - టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.


కొద్దిగా నడచిన వచ్చును కొండంత బలము.
శ్రద్ధ పెట్టి చరించ జవసత్వములు సొంతము.

స్వచ్ఛమైన గాలిన పీల్చిన శక్తి కలుగును.
ముచ్చట్ల నాడుతూ సాగిన చింత తొలుగును.

ప్రాతఃకాలములో సూర్యదర్శనమద్భుతము.
భాతిగా నిడును మన కెనలేని యారోగ్యము.

మితముగా భుజంచిన తరుగు నూబకాయము.
అతిగా చరవాణిని కనుచుండ నదే హానికారకము.

శాకముల నారగింప దేహాన నీటి శాతము పెరుగును.
ఆకలిని మరచి టి. వి. చూడటమనర్థదాయకము.

అందరితో కలసి భోంచేసే క్రమశిక్షణను పాటించుము.
పెందలాడి నిదురించే యలవాటును విస్మరించకుము.

నిందారోపణలు మాని నియమనిష్ఠలతో మెలుగుము.
ఎందుకులే కోపము? వత్తిడిని పెంచునా దుర్గుణము.

ప్రకృతిని పూజించి చెట్లు పెంచితే పరమాత్మ కిష్టము.
వికృత చేష్టలు మాని ప్రేమగా మసలుటే మన ధర్మము.//

కామెంట్‌లు