అరుణం అలదినట్టు
ఏటి నుదుట సిందూరం
మేటిగా మెరిసేటట్టు...
నిలువక సాగే అలల
నిగమ మంత్రాలు
నిలువరించే వెలుగుల
నిగనిగల మెరుపులు
నిత్యమూ ఏతెంచు
నీరజభవునకు
పచ్చనాకుల కొమ్మలు
పచ్చతోరణమాయే!
ప్రభాకరుని స్వాగతింప
ప్రాగ్దిశ వేదిక కాగా
ఎరుపు యవనికలూగ
తరలి వచ్చే తరణి ధరకు!
వెలుగు వెల్లలు వేయ
వేకువ వెడలి రాగా
వేదనలు అంతరించి
వేయి ఆశలు చిగురించు
వెలుగన్న వింత ధైర్యము
వేకువన్న అంతే నమ్మకము
వేలుపు తానే తోడై మనను
వేలుపట్టి తప్పక నడిపించు!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి