మనిషి జీవితమంతా లెక్కలమయం: - పంచదార్ల మాణిక్యాలరావు
 

సూక్ష్మబిందువుగామొదలైన
ఈప్రాణగమనమేఅనంతకథనం...
నవమాసాలనిశ్శబ్దతపస్సుతో
సిద్ధించినదిఈశిశువుజననం!
జననమేఆరంభమైగిట్టేవరకు
సాగేదిలెక్కలసహవాసం...
నిరంతరవిశ్లేషణలప్రవాహమే
ఈగణితజీవనవిలాసం!
చేవృత్తులబతుకునుండి
ఆటపాటలవరకుగణితమేఆధారం...
మనిషిప్రతికదలికలోనూ
దాగున్నదిసంఖ్యాపరిక్రియలసారం!
ఎదిగేక్రమమేఆరోహణమై
ఆశయశిఖరాలనుతాకాలి...
ఒదిగేక్రమమేఅవరోహణమై
వినయసౌరభాన్నిపూయాలి!
స్నేహితులతోసంకలనమై
అనురాగాలబాటనుకూడాలి...
శత్రుత్వపువ్యవకలనంతో
మనసుమాలిన్యాన్నివీడాలి!
సుగుణాలగుణకారంతో
వ్యక్తిత్వపుపరిమళాన్నిపెంచాలి...
పదిమందికిపంచేభాగహారంతోనే
నిజమైనతృప్తినిపొందాలి!
మానవత్వపుపరిమళాలను
పంచడమేమిన్నయైనగ్రేటర్దేన్...
దానవత్వపుచీకటిలక్షణాలను
తృంచడమేనిజమైనలెస్దేన్!
విడనాడాలి'నేనేగొప్ప'అనే
అహంకారపుభయంకరఘాతాంకం...
లేకుంటేమట్టిలోకలిసిపోయే
ఈమాయాదేహముఒకశూన్యం!
పొందినదిఏమిటి..పోగొట్టుకున్నదిఏమిటి
అన్నదిఒకవిశ్లేషణ...
చచ్చేనాడుఏదీరాదుఅన్నసత్యమే
ఈజీవితానికిఅసలైనముగింపు!
 
కామెంట్‌లు