అలారం: - - యామిజాల జగదీశ్
 

కోడి కూత నుండి 'మనిషి అలారం' వరకు — అలారం గడియారం రాకముందు తెల్లవారుజామున ప్రజలు ఎలా మేల్కొనేవారు?
కోడి కూత పల్లెల్లో కోడి కూసే శబ్దం ప్రకృతి సిద్ధమైన అలారంగా పనిచేస్తుంది.
దేవాలయాలు, కార్మికుల శబ్దాలు గ్రామాల్లో గుడి గంటలు, నగరాల్లో కర్మాగారాల సైరన్లు ఉదయం వేళను తెలియజేసేవి.
మనిషి సాయం యూరప్ దేశాల్లో నిర్ణీత సమయానికి ఇంటి కిటికీలు తట్టి నిద్రలేపడానికి మనుషులను పనిచేసేవారిగా పెట్టుకునేవారు.
నీళ్లు తాగే పద్ధతిలో... పడుకునేముందు ఎక్కువగా నీళ్లు తాగి పడుకునేవారు. ఉదయాన్నే మూత్ర విసర్జన చేయాలనే బలమైన కోరిక వారిని సరైన సమయానికి మేల్కొనేలా చేసేది.
మేకులతో కొవ్వొత్తి అలారం కొవ్వొత్తికి ఒక నిర్దుష్ట ఎత్తులో మేకులు లేదా సూదులు గుచ్చి ఉంచేవారు. కొవ్వొత్తి కరిగి ఆ మేకు కింద ఉన్న కంచంలో పడినప్పుడు వచ్చే శబ్దం వల్ల నిద్రలేచేవారు.
కిటికీ ద్వారా బఠానీలు విసరడం చిన్న ఊదుగొట్టంలో ఎండు బఠానీలు నింపి, కిటికీల గుండ నిద్రపోతున్న వారిపైకి ఊదేవారు. ఆ బఠానీలు ఒంటిపై పడగానే నిద్రమత్తు వదిలి లేచేవారు.
కామెంట్‌లు