వనవాసమునకు పంపించుటలో
నా పాత్రయుంటే నాకు మహాపాపమంటును
నాకు దుర్గతీయు ప్రాప్తించునమ్మా!
జనయిత్రీ! పూజ్యుడైన శ్రీరాముని
అడవుల పాలు చేయుటలో
నాకును ఎలాంటి భాగము ఉన్నచో
దిక్కులేని అనాధలా నా బ్రతుకు గడుచును
శ్రీరామునికి నేనేద్రోహము తలపెట్టలేదు
ఓ తల్లీ! కౌసల్యాదేవి నేను ఏ పాపమెరుగను
అమ్మా! అన్నను అడవికి పంపుటలో
నా ప్రమయము ఏమైనా యున్నచో
నేను చేసిన పుణ్యాలన్నియు నశించిపోవును
భరతుడు పలు విధముల పలుకుతూ
తల్లి కౌసల్యమాతను ఓదారుస్తూ
తన తల్లి కైకేయిని భరతుడు నిందిస్తూ
మిక్కిలిగా దుఃఖిస్తూ నిట్టూరుస్తుండెను
కౌసల్య దేవి భరతుని తన ఒడిలోకి తీసుకొని
ఆ మహాబాహును కౌగిలించుకొని
ఆ తల్లి మిక్కిలి దుఃఖించుచుండెను
ఆ రాత్రంతా కౌసల్య వద్ద భరతుడు గడిపెను
============================
అయోధ్యకాండ యందు 75వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి