వానకి పల్లె వేచింది!! : -ఎం. వి. ఉమాదేవి ఆగస్టు 13, 2026 • T. VEDANTA SURY వానకోసం పల్లె వేచింది!వరుణుడా రమ్మని అడిగింది!బొడ్రాయికి నీళ్ళు పోసింది! కప్పలకి పెళ్ళిళ్లు చేసింది!! ఎండిపోయిన చేలు ఏడ్చాయి!పండుటాకులు రాలిపోయాయి!ఊరి బావుల్లోనా నీళ్లేవీ?చెరువులో తామర తూడులేవి!? కొంగబావకి పంగనామాలు చేపపిల్లలే లేని కాలువలు నింగిలో కానరాని మేఘాలు వచ్చిపోయాయిలే దొంగమబ్బులు!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి