విషయ సేకరణ, వర్ణనలు: - డా సి.వసుంధర


కావ్యంరాయడం వేరు/
విషయ పూర్ణంగా
వివరణ,పరిశోధనా పూర్వకంగా రాయడం
వేరు/


 సీత స్వయం వరానికి మిధిలానగరానికి
 విచ్చేసిన రాజుల పేర్లు
 చూడండి

ద్రావిడ   కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర....
బాండ్య ఘార్జర, లాట బర్బర మలయాళ......
గౌళ,కెరళ సింధూ కోసల సాల్వ, మత్స కళింగ
, మాళవ నేపాళాది
రాజులు ఏ ఏ వాహనాల మీద వచ్చారో మొల్ల వివ
రించిన తీరు ఆమె యొక్క విషయ పరిజ్ఞానికి అద్దం పట్టినది.
(కేరళ,మలయాళం వేరే చెప్పింది)

వచ్చినవారిని గూర్చి చెబుతూ ఒక్క వాక్యంలో ..".సందడి గాగా వచ్చిరి భుజంబు
భుజంబులు త్రోపులాడగన్" అని చెప్పి ఆ జనసందోహాన్ని మనకళ్లముందు నిలిపింది.ఇలా ఉండాలి కవిత అని అనుకోవాలి మనం.

జీర్ణచాపము (సం)
దానిని తెనిగించింది
మొల్ల" చివుకు విల్లు,"అని

పద్య మొదలు. చూడండి
"ఇది విల్లా కొండా..."అని అనుకోన్నారట వచ్చినవారు
  ఇది కవితా!అని మనం ఆశ్యర్య పోవాలి
 
మొల్ల రుచి అనే పదం బాగా  
వాడింది  అందుకే
రుచిగల పదార్ధం
కొంచెం కొంచెం తినాలి.అలాగే రుచిగల కవిత్వం కొంచెం విని ఏక్కువగా ఒంట
బట్టిచ్చుకోవాలి.
        🦚
ఈ నాటి
ఉదయగానం.
అరుణ బింబ  మది కరుణకాంతుల నిధి వచ్చుచున్నదది కైమోడ్చి నిలువు 
రవి కెదురుగా మానవా!
 సి వసుంధర.🙏🙏🙏
కామెంట్‌లు