సాధారణంగా మనం ఒక్క పనిని మాత్రమే ఏకాగ్రతతో చేస్తాం. పది పనులను ఒకేసారి చేయలేం. మనం ఒక పనిని చేస్తున్నప్పుడు మన మైండ్ లో కూడా ఒక డ్రామా నడుస్తుంటుంది. అది చేసే పని గురించి కావచ్చు లేదా మరేదైనా విషయం కావచ్చు.. అలా మైండ్ తన పని తాను తీసుకుంటుంది. అలాగే చేసే పని కూడా జరుగుతుంటుంది. అంటే ఇక్కడ మైండ్ కు ఏకాగ్రత లేదని మైండ్ కాంస్యస్నెస్ కలుషితమవుతుందని అర్థమవుతుంది. ఒక పనిని మన నిజంగా చేస్తున్నప్పుడు మన మైండ్ లో ఎలాంటి డ్రామా ఉండదు. అంటే వేరే ఆలోచనలేవి ఉండవు కేవలం చేస్తున్న పని మాత్రమే కొనసాగుతుంటుంది. అలాగే ఏదైనా చదివేటప్పుడు కూడా మన మైండ్ లో ఆ పని మాత్రమే కొనసాగుతుంది. కానీ సెల్ఫోన్ చూసేటప్పుడు టీవీ చూసేటప్పుడు మాత్రం ఒక మ్యాజిక్ జరుగుతుంది. మనం చూస్తున్నది కాకుండా మన మైండ్ లో మరో డ్రామా నడుస్తుంటుంది.
అంటే ఏకాగ్రత లేకపోవడం వలన కావచ్చు. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే పుస్తకాలు చదవడం లేదా ఏదైనా పని చేసుకుంటూ ఉండటం వలన మైండ్ లో డ్రామా నడవకుండా కేవలం ఆ పని మీద మాత్రమే మన ధ్యాస ఉంటుంది. కానీ సెల్ ఫోన్లు చూసేటప్పుడు అందులోని కాంటెంట్ మాత్రమే కాదు పూర్తిగా ఏదైనా కావచ్చు సెల్ ఫోను ఒక విలన్ లా ప్రవర్తిస్తుంది. మంచిని కూడా విలనే వినిపిస్తాడు. చెడును కూడా విలనే వినిపిస్తాడు. అంటే సెల్ ఫోను నడిపేది కేవలం విలన్ మాత్రమే కావడం విశేషం. ఇది ఒక మ్యాజిక్ పూర్తిగా గమనించండి. సెల్ ఫోను కేవలం విలన్ మాత్రమే అని అర్థమవుతుంది. అసలు విషయం ఏమిటంటే టీవీ సెల్ ఫోన్ చూసేటప్పుడు ఏకాగ్రత ఉండదు. సెల్ ఫోను తన పని తాను చేసుకుంటూ పోతుంది. మైండ్ లో కూడా సమాంతరంగా ఒక డ్రామా నడుస్తుంటుంది. అంటే మైండ్ కాన్సియస్నెస్ లో సమాచారం నడుస్తుందని అర్థమవుతుంది. కొన్నిసార్లు మైండ్ చైతన్యంలో డ్రామాను ఆపడానికి సెల్ ఫోను ప్రయత్నం చేయవచ్చు. కానీ మైండ్ కాన్సియస్నెస్ బలంగా ఉండటం వలన మైండ్ లో ఒక డ్రామా నడుస్తూ తన పని తను చేసుకుంటూ పోతుంది. కొన్నిసార్లు మైండ్ చైతన్యం బలహీనపడటం వలన. సెల్ఫోన్ టీవీలోని కాంటెంట్ మైండ్ చైతన్యాన్ని డామినేట్ చేస్తుంటాయి. ఏది ఏమైనా మైండ్ చైతన్యంలో ఉన్న సమాచారం వలన మైండ్ మనం చేస్తున్న పని కూడా లెక్కచేయకుండా తన డ్రామాలు అది నడిపిస్తుంది తన సమాచారంతో. కొన్నిసార్లు సెల్ఫోన్ టీవీ సమాచారం కూడా మైండ్ చైతన్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ రకంగా మైండ్ చైతన్యం సెల్ ఫోను టీవీ సమాచారం మైండ్ లో సమాంతరంగా ప్రయాణం చేస్తుంటాయి. దానివల్ల ఏకాగ్రత కు బంగం కలుగుతుంది. మైండ్ చైతన్యాన్ని నడిపించే శరీర సమాచారం మరియు జ్ఞాపక సమాచారం వలన కూడా మైండ్ చైతన్యం లో డ్రామా నడుస్తుంటుంది. దానికి తోడు సెల్ఫోన్ టీవీ సమాచారం కూడా కొన్నిసార్లు మైండ్ చైతన్యంలోకి ప్రవేశించి డ్రామాను నడుపుతుంటుంది. మనం మైండ్ చైతన్యాన్ని కంట్రోల్ చేయగలిగితే దాన్నే మనం ఏకాగ్రత అంటున్నాం. అలా సెల్ఫోన్ టీవీ సమాచారాన్ని మనం కంట్రోల్ చేయలేం అది తన పని తను చేసుకుంటూ పోతుంది. మైండ్ చైతన్యాన్ని కంట్రోల్ చేసినంతగా సెల్ఫోన్ టీవీ సమాచారాన్ని మైండ్ చైతన్యంలో ప్రవేశించినంక కంట్రోల్ చేయలేము. అందువల్ల మైండ్ లో ఒక డ్రామా నడుస్తుంది. సమాంతరంగా సెల్ఫోన్ టీవీ సమాచారం కూడా నడుస్తుంటుంది.
=========================================================
డా ప్రతాప్ కౌటిళ్యా , విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి