చేతులలో సరస్వతి
బుద్ధినిచ్చు బృహస్పతి
పుటలలో జ్ఞానజ్యోతి
పుస్తకమా! ప్రణామము!
రామాయణం చదివించు
భాగవతం వినిపించు
గ్రంథాలుగా కనిపించు
పుస్తకమా! ప్రణామము!
ప్రహేళిక తికమక
హాస్యరస పకపక
చారిత్రక కలయిక
పుస్తకమా! ప్రణామము!
గౌరవము అందించును
సంస్కారము కల్పించును
అందలము ఎక్కించును
పుస్తకమా! ప్రణామము!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి