గజల్: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


చదవటానికి చాలా సొంపైనది తెలుగుగజల్
వర్ణించటానికి సుందరమైనది తెలుగుగజల్॥

కనువిందు చేస్తూ హృదయములను గెలిచేదీ
పాడటానికి గానయోగ్యమైనది తెలుగుగజల్॥

గాంధర్వ గానమై మదులను మురిపించే స్వరమై
చెప్పటానికి మాధుర్యమైనది తెలుగుగజల్॥

తీపి మాటలతో రంజింపజేసే గీతమై
రాయటానికి లయబద్ధమైనది తెలుగుగజల్॥

అందమైన ఊహలను చక్కగా ఒలికించేదీ
భావనలందు కడు సున్నితమైనది తెలుగుగజల్॥

సుకుమార భావమై మదిని మెల్లగా తడిమేదీ
శృంగారానికి ఆలవాలమైనది తెలుగుగజల్॥

ప్రేమభావనతో విజయపథం వైపు నడిపేదీ
ప్రోత్సాహానికి శక్తివంతమైనది తెలుగుగజల్॥

విరహవేదనను తట్టుకోలేక వెల్లగక్కేదీ
ఆలాపనలకు అనుకూలమైనది తెలుగుగజల్॥

కాఫియా రదీఫుల కమ్మనైన ప్రయోగంతో
ద్విపదలతో ప్రాసయుక్తమైనది తెలుగుగజల్॥

కామెంట్‌లు