దీసుకొని శ్రీరాముని వద్దకు వెళ్ళెదను
పురుషశ్రేష్టుడైన శ్రీరాముని పూజించి
ఆచటనే పట్టాభిషిక్తుని గావించి
యాగశాల నుండి త్రేతాగ్నివలె
శ్రీరాముని ఇచ్చటకు గొనివచ్చెదను
కైకేయి పేరుకు మాత్రమే నాకు తల్లి
ఈమెలో మాతృభావము కొంచమైనా లేదు
ఈమె కోరికను నెరవేరనీయను
ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజౌను
నేను ఆ కారడవులలో నివసించెదను
భరతుని మాటలకు అందరు సంతోషించిరి
రాజకుమారుడైన భరతుడు నుడివిన
పలుకులన్నియు ఆణిముత్యములే
అచటి పెద్దలందరు మిక్కిలి సంతోషించిరి
అందరికనుల నుండి ఆనందభాష్పాలు రాలేను
భరతుని సంకల్పము గూర్చి విన్న పెద్దలకు
శ్రీరామునిపై య్యన్న దుఃఖము బోయెను
శిల్పులను రక్షకులను పిలిపించెదమని
మంత్రులు భక్తితో భరతునికి తెలిపిరి.
=============================
అయోధ్యకాండమందు 79 వ సర్గ సమాప్తము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి