బాలలం...!!: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


ఆకాశమే మా దేశం 
భూగోళమే మా దేశం 
మహాసముద్రమే మా దేశం 

మేం బాలలం...!!
మాకు సరిహద్దులు లేవు 
మాకు హద్దులు లేవు 
మాకు భేద భావాలు లేవు
మాకు వివక్ష లేదు కక్షలు లేవు 
మేము బాలలం.....!!

ఆకాశంలో పక్షుల్లా ఎగురుతాం 
అడవిలో సింహంలా నడుస్తాం 
సముద్రంలో చేపల ఈదుతాం..!!
మేం మేం బాలలం...

పక్షికి స్వేచ్ఛను ఎవరిచ్చారు 
సింహాన్ని అడవికి రాజును ఎవరు చేశారు. 
చేపకు ఈదటం ఎవరు నేర్పారు. 
మేం బాలలం....

మేం బాలలం బంతులం 
రేపటి బలవంతులం భాగ్యవంతులం
తిండి మా కండబలం 
చదువు మా గుండె బలం 
శ్రమ మా ఆత్మవిశ్వాసం 
కల మా విశ్వాసం..........!!

ఆటలు పాటలు -మాటలు పోటీలు 
మా పోట్లాటలు మా తెలివితేటలు..

మేం మొక్కలం రేపటి మహావృక్షాలం
మేం సైనికులం దేశ రక్షకులం 
మేం సేవకులం రేపటి నాయకులం
మేం శ్రామికులం మేధావులం రేపటి దేశ సంపదలం..!!
===============================================
పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని. 
==============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు