బాల్యంలో అమ్మమ్మ అనేది
దొంగలు ఎత్తుకెళ్లని విద్య పుస్తకమని
అక్షరం ముక్క వస్తే అన్నానికి లోటు ఉండదని
తానే స్వయంగా దగ్గర కూర్చోబెట్టుకు
సుమతీ వేమన శతకాలను
రామాయణ మహాభారత గ్రంథాలు
చిన్నయసూరి పంచతంత్ర కథలను చెప్పేది
సమాజ హితమే పుస్తక విషయం కావాలి
అజ్ఞానాన్ని రూపుమాపి విజ్ఞానాన్ని తెలిపేది
యుక్తా యుక్త విచక్షణ కలిగించి
మనుగడ కాదారమైనది పుస్తక పరిమళం
మా చిన్నప్పుడు గ్రంథాలయాలకు వెళ్ళి
పుస్తకాలు చదివేవారు
శాస్త్రీరీత్య ధారణశక్తి పెంచే సాధనం
శాస్త్ర సాంకేతికత పెరిగినా చరవాణి కే పరిమితమై
సాహితీ రచనలు చేయడం మంచిదేకాని
స్వయంగా పుస్తకపఠనం చేసి అవగాహనతో రచనలు చేస్తే
మానసిక ప్రశాంతత కలుగునని ఋజువయంది
పుస్తకం హస్తభూషణం గాకూడదు
విజ్ఞానాన్ని మనుగడకు ఆధారమై
ప్రగతికి సాధనమైన సాధనం
గంజేంద్ర మోక్ష.లోని పద్యాలు
ప్రహ్లాదుడు చెప్పే పద్యాలు
వేమన సుమతీ శతక పద్యాల పరిమళం వర్ణింప తరమా
సంఘ సంస్కర్త వీరేశలింగం చెప్పినట్లు
చిరిగిన చొక్కానైనా ధరించు
మంచి పుస్తకాన్ని వదలకన్నది జీవిత సత్యం...!!
...............,........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి