ఆయుధ కర్మాగారం ఉన్నత పాఠశాలలో ఎడమచేతి వాటం దినోత్సవం
 

కంది మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు ఎడమ చేతి వాటం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుగు భాష ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు విద్యార్థులకు వివరించారు. ఎడమ చేతి వాటమనేది మనిషి యొక్క లోపం కాదని, అది మనిషి యొక్క ప్రత్యేకత అని, ఎడమ చేతి వాటం కలవారిలో ప్రసిద్ధ వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని, జనాభాలో 11 శాతం మంది ఎడమచేతి వాటం కలవారేనని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎడమ చేతి వాటం కల విద్యార్థులు మహిపాల్( ఏడవ తరగతి), లత( ఎనిమిదవ తరగతి), ఫైమా బేగం( తొమ్మిదవ తరగతి )లకు శుభాకాంక్షలు తెలిపి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, చవాన్ సుభాన్ సింగ్ పాల్గొన్నారు.
కామెంట్‌లు