రమ్యమైన రంగవల్లులు!: - పాలగుమ్మి జ్యోతి.


వాకిట కల్లాపి చల్లండి 
 చుక్క చుక్క కలపండి 
 చక్కని ముగ్గులు వేయండి 
 ఇంటికి శోభని కూర్చండి!!

 తామరలన్నీ విచ్చాయి
 చిలుకలు నెమళ్ళు వచ్చాయి
 దీపాలన్నీ వెలిగాయి 
 ముగ్గులలో అవి వెలిశాయి!!

 విజ్జ ముగ్గులో గీతలు  
 బుజ్జి ముగ్గులో మెలికలు
 సుజ్జి ముగ్గులో జోకరులు 
 చూపారంతా చతురతలు!!

ముగ్గులు చక్కగ వేశారు 
అందున రంగులు నింపారు 
అలసటనంతా మరిచారు 
త్రొక్కిన వారిని అరిచారు!!
  
కామెంట్‌లు