చిలుకలతో తలనొప్పి: - - యామిజాల జగదీశ్


 ఒక వన్యప్రాణి పార్కులో ఉన్న 5 చిలుకలను విడివిడిగా పెట్టాల్సి వచ్చింది! ఎందుకంటే, అవి వచ్చే సందర్శకులను తిడుతూ, ఆ వెంటనే తమలో తామే నవ్వుకోవడం మొదలుపెట్టాయి!
Billy, Eric, Jade, Elsie, Tyson అనే ఈ ఐదు ఆఫ్రికా గ్రే చిలుకలను ఒకే వారంలో ఇళ్ల నుంచి Lincolnshire Wildlife Parkకి తీసుకొచ్చారు.
అక్కడికి వచ్చిన కొద్ది రోజులకే, అవి ఒక్కదాన్ని ఒకటి తిట్టుకోవడం ప్రారంభించాయి. అంతటితో ఆగకుండా పార్కుకి వచ్చే జనాన్నిసైతం తిడుతూ, పక్కనున్న మిగిలిన చిలుకలు కూడా జనాలను తిట్టేలా ప్రేరేపించాయి. 
ఈ తిట్ల గొడవ తగ్గుతుందేమో అని సిబ్బంది వాటిని కాస్త పెద్ద వయసున్న చిలుకలతో కలిపి ఉంచారు.
కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది!
ఆ తిట్టే అలవాటు మిగిలిన చిలుకలకు కూడా పాకింది. 
ఆఫ్రికా గ్రే చిలుకలు చాలా తెలివైనవి. మనుషుల గొంతును, శబ్దాలను యథాతథంగా అనుకరించగలవు.
అవి తిడుతున్నప్పుడు సందర్శకులు నవ్వడం చూసి, ఆ నవ్వును కూడా చిలుకలు నేర్చేసుకున్నాయి!
దీంతో జనాన్ని తిట్టడం… ఆ వెంటనే గట్టిగా నవ్వుకోవడం ఈ చిలుకల గ్యాంగ్‌కు అలవాటైపోయింది. 
చిలుకలకు ఇంత తెలివి తేటలు ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నారా? 
కామెంట్‌లు