ఏమండోయ్ ప్రధానమంత్రి మోడీ గారు నేటి పరిస్థితుల్లో ఇంధనం పొదుపు చేయమనడం మంచిదే అది ఉద్యోగస్తులకు, వయసులో ఉన్న వారికి మాత్రమే మీరు ఏమి ఇరవై సంవత్సరాల బాలా కుమారుడు కాదు మనమడు ప్రదీప్ కారులో తీసుకొని పక్క వీధిలో ఉన్న అత్తయ్య అదే మన మీనాక్షి ఇంటికి తీసుకు వెళతానంటే వద్దురా నీ సైకిల్ చాలు అరవై ఏళ్ల క్రిందట నేను ర్యాలీ సైకిల్ ఉపయోగించి అనకాపల్లి లో ఉన్న కళాశాలకు ఐదు మైళ్ళు వెళ్లేవాడిని ఇప్పటికీ సైకిల్ తొక్క గలను. నానమ్మ కూడా ఆరోజుల్లోనే కళాశాలలో సైకిల్ రేసింగ్ లో ప్రథమ స్థానాన్ని పొందింది అని డెబ్భై ఐదేళ్ళ రామారావు మాస్టారు మనుమడితో చెప్పారు.
ఆ మాట విని భార్య జానకమ్మ అది వయసులో ఉన్న మాట ఇప్పుడు నాకు డెబ్భై మీకు డెబ్బై ఐదు ఏళ్లు బైక్ నడిపి పదేళ్ళు అయింది కొడుకు ప్రకాష్ కి ఏభై ఐదు ఏళ్లు .ఈ మాట వింటే ఏమనుకుంటారు ఏమైనా అంటే నలబై సంవత్సరాలు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేశాను అంటారు ఏదైనా వయస్సులో పాటు మనము మారాలి అంటే అధికాదే జానకి ఈనాటి పరిస్థితుల్లో మోడీ గారు మన చంద్రబాబు నాయుడు చెప్పినది కరెక్టే ఇంధనం పొదుపు చేయకపోతే ఆర్థికమాన్యం పెరుగుతుంది ఇప్పటికే చాలా దేశాలు వారానికి ఒక రోజైనా సైకిల్ మీద కార్యాలయానికి వెళ్లాలని చెప్పాయి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చెప్పారు .అనవసరంగా ఇంధనం వృధా చేస్తే ఆర్థిక మాన్యం పెరిగి దేశ అభివృద్ధి కుంటుపడుతుంది అది గాక నడక ,సైకిలు ఉపయోగించక అస్తమాను బైకులు కారులు ఉపయోగించడం వల్లే అనారోగ్యం ఇరవై ఏళ్లకే అరవై ఏండ్లు దాటిన వాడిలా తయారవుతున్నారు అనకూడదు గాని ఇంత వయసు వచ్చినా మనకి బిపి ,షుగర్ జబ్బులు ఏవైనా ఉన్నాయా అంటే ఇక ఆపండి మీ వ్యాయామ సూత్రాలు ఒరేయ్ ప్రదీప్ నేను తాతయ్య కలిసి సైకిల్ మీద పక్క వీధిలో ఉన్న అత్తయ్య మీనాక్షి దగ్గరికి వెళతాం అన్నారు.
నానమ్మ వెళ్లగలవా అంటే నాకేం భయం లేదురా నేను వ్యాయామ ఉపాధ్యాయిని భార్యని బడిలోనే కాదు ఇంటిదగ్గర కూడా మీ తాతయ్య నా చేత ఆరోగ్యం ఆరోగ్యమని ఎక్కడికి వెళ్లినా సైకిలు మీదే అలాగే నడక మన ఆరోగ్యానికి మంచిదని యాత్రలలో నడిపించేవారు ఒకటా రెండా సుమారు ఏభై ఏళ్ళయి చూస్తున్నాను ఆయన చెప్పినది నిజమే కదరా ' ఆరోగ్యమే మహాభాగ్యం 'అది కాకుండా గల్ఫ్ యుద్ధం ప్రభావము మరియు అధికంగా ఇంధన వాహనాలు ఉపయోగిస్తే కలిగే కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి అని చెప్పి పదండి ' ముసలా యన 'నే రెడీ సైకిల్ మీద కూతురు మీనాక్షి ఇంటికి వెళదాం అంటే అలాగే 'ముసలి' అని నవ్వుకుంటూ తాతయ్య నానమ్మ వెళ్లడం చూసి ఇరవై ఐదు ఏళ్ల ప్రదీప్ అన్యోన్య దాంపత్యానికి ప్రతీక తాతయ్య నానమ్మలే వారే నాకు ఆదర్శం అని మనసులో అనుకున్నాడు..!!
....................................
...........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి