. అక్షరాల నందనం...; - నాగమణి రావులపాటి..


 భాషకు అందం అక్షర మాలల సుగంధం.
భావన లొలికే చిత్రాల లీలా విలాసం.
కనుల ముందు నిలిచే రూప లావణ్యం.
కవితగ మారే అద్భుత దీపపు కాంతి.
పదముల పొందిక పూల తోట అలంకారం.
చిత్రము తెలిపే మనసు పలికే తీయని మాట.
 
రంగుల వెనుక దాగిన భావం తరంగం.
రసజ్ఞుల హృదయాల పరమ జీవన సారం.
రూపానికి ప్రాణం పోసే కలం అలంకారం.
భావ తరంగాల అనంత బల ప్రదర్శనం.
కంటికి విందుగ నిలిచే బొమ్మల పండుగ.
కవితకు ప్రేరణనిచ్చే అమ్మ బ్రతుకు చిత్రం.
సాహితీ వనమున విరిసిన సుమ సోభితం.
సృజనాత్మకతకు ఇదియే మార్గ దర్శకం.
చిత్రమే ఒక చక్కని కవితై నిలువరించే మనసులను.
కవుల కలాల ప్రవాహమే చూపును గెలుపును.
కామెంట్‌లు