భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. పద్మ భూషణ, పద్మ విభూషణ పురస్కార గ్రహీత విక్రం సారాభాయ్ గురించి తెలుసుకుందామా!
విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ భారతీయ శాస్త్రవేత్త. 1919 వ సం. లో ఆగస్టు 12వ తేదీన అహ్మాదాబాద్‌లో జన్మించారు. విక్రమ్ తండ్రి అంబాలాల్ పేరు పొందిన పారిశ్రమికవేత్త. తల్లిదండ్రులది సంపన్న కుటుంబం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మాదాబాద్‌లో ఉండేవారు. విక్రమ్ జన్మించినపుడు బ్రిటిష్ ఇండియాలోని బాంబాయి ప్రావిన్స్‌లో ఉండేది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రలలో ఉన్నది. తల్లిదండ్రుల పేర్లు అంబాలాల్ సారాభాయ్, సరళాదేవి. విక్రమ్ పుట్ట్పేటప్పటికే అహ్మాదాబాద్‌లోని అత్యంత సంపన్నులైన వ్యాపారస్తులు నివసించే ప్రాంతంలో ఉండేవారు. షాహిబాగ్ అనే ప్రాంతంలో 21 ఎకరాల స్థలంలో నిర్మించిన ' రిట్రీట్' అనే బంగ్లాలో నివసించేవారు. అహ్మాదాబాద్‌లో కాలికో మిల్లు, బీహర్‌లో పంచదార మిల్లు, ఆఫ్రికాలో పత్తి వడికే మిల్లు, తూర్పు బెంగాల్‌లో రైల్వేలైను, టీబెట్‌లో పశువుల జూలు వ్యాపారం వంటివి ఎన్నో ఉన్నాయి. పారిశ్రామిక కార్యాలయం లండన్‌లో ఉన్చది. వీరిది దాస శ్రీమాలి శాఖకు చెందిన కుటుంబం.
విక్రమ్ సారాభాయ్ కుటుంబం స్వాత్రంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. వీరింటికి తరచుగా మహాత్మాగాంధీ, రవీద్రనాథ్ ఠాగూర్, మోతిలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రముఖ నాయకులు వస్తూ ఉండేవారు. వీరందరూ విక్రమ్ వ్యక్తిత్వాన్ని
ప్రభావితం చేశారు. విక్రమ్ కోసం తల్లి సరళాదేని మాంటిస్సోరి లాంటి స్కూలును ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ చదువుకున్నారు. ఆ తర్వాత పైచదువుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్ళారు. అక్కడి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నాచురల్ సైన్సెస్ చదువుకున్నారు. 1940లో ట్రిపోన్‌లో ఉత్తీర్ణత సాంధించారు.
ఈ సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. అందువలన విక్రమ్ సారాభాయ్ భారతదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చేరారు. అక్కడ సి.వి. రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. అంతలో రెండవ ప్రపంచ యుద్ధం ముగియడంతో, మరల ఇంగ్లాండ్ వెళ్ళడానికి సమాయత్తం అయ్యారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పట్టాను సాంధించుకున్నారు. 1947వ సం. లో తిరిగి భారతదేశం వచ్చారు.
విక్రమ్ సారాభాయ్ పెళ్ళికి విక్రమ్ బంధువులు ఎవరూ హాజరు కాలేదు. ఆ సమయంలో క్విటీ ఇండియా ఉద్యమం జరుగుతున్నది. అందువలన విక్రమ్ సారాభాయ్ కుటుంబమంతా క్వింట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. విక్రమ్ సారాభాయ్ మృణాలినీ పెళ్ళి చేసుకున్చారు. మృణాలినీ సారాభాయ్ మంచి పేరున్న నర్తకీమణి. వీరి వివాహం చెన్నైలో జరిగింది. వీరికోక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు మల్లికా సారాభాయ్, కుమారుడు కార్తికేయ సారాభాయ్. మల్లికా సారాభాయ్ కూడా మంచి నర్తకీగా పేరు గాంచింది.
భారత అంతరిక్షరంగ పితా మహుడుగా పేరు పొందిన విక్రమ్ సారాభాయ్‌ని ప్రభుత్వం గుర్తించి గౌరవించింది. 1957లో రష్యా మొదటి శాటిలైట్‌ను ప్రయోగించారు. స్ఫుత్నిక్‌ను రష్యా ప్రయోగించినపుడు భారత్ కూడా ఆదిశగా కృషి చేయాలని అనుకున్నది. శాటిలైట్ల ఆవశ్యకతను గుర్తించి, ఆనాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూకు వివరించి ఒప్పించారు.
1962లో హామీ భాభా పర్యవేక్షణలో ఇస్రోను ఏర్పాటు చేశారు. ఇస్రో ఎన్నో విజయులను సాధించింది. భారతదేశ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్ళింది.
1962 లో భారత ప్రభుత్వం సారాభాయ్ సేవలకు గుర్తింపుగా శాంతి స్వరూవ్ భట్నాగల్ అవార్డునిచ్చి గౌరవించింది. 1966లో విక్రమ్ సారాభాయ్ పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది. జాతీయస్థాయిలోనూ, అంతర్జాతీయస్థాయిలోనూ భారత ఖ్యాతిని పెంచారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమస్యల పరిష్కారం కోసం మనం కూడా తక్కువ కాదని నిరూపించారు.
గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించాలని విక్రమ్ సారాభియ్ ఆలోచించేవారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకు రావాలనే కోరిక బలంగా ఉండేది. విక్రమ్ సారాభాయ్ వ్యూహాలన్నీ, ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే ఉండేవి. మన దేశంలోని సమస్యలను పరిష్కరించవచ్చని విక్రమ్ సారాభాయ్ మిగతా శాస్త్రవేత్తలకు చెప్పేవారు. విక్రమ్ చెప్పే విషయాలు తోటి సైంటిస్టులను ఉత్సాహపరిచేవి.
సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొదించటం మొదలు పెట్టారు. రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అవసరమని గుర్తించారు. అంతరిక్షంలోకి మానవుల్ని ఎలా పంపాలో అని ఆలోచించేవారు. అంతరిక్షరంగంలోని కీలక రంగాలను ఎలా వాడుకోవాలో నిరంతరం పరిశోధించేవారు. సంప్రదాయ వ్యవస్థలను అంతరిక్ష వ్యవస్థకు ఎలా కలాపాలా అని ప్రయోగాలు చేపట్టేవారు. విక్రమ్ సారాభాయి వ్యూహాలను దేశ అంతరిక్ష వ్యవస్థ ఉయయోగించుకున్నది. అంతరిక్ష రంగ పితామహుగా పేరుగాంచారు. 1971వ సం.లో డిసెంబర్ 30వ తేదీన విక్రమ్ సారాభాయ్ కేరళలోని తిరువనంతపురంలో మరణించారు. మరణానంతరం సారాభాయ్‌కి పద్మవిభూషణ్ ఇచ్చి గొరమిచ్చారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి