అత్తరు సీసా: - వరలక్ష్మి యనమండ్ర


అత్తరు సీసా చిన్నది 
అందరు కోరే కొంటెది 
చిన్ని సీసాలో ఉంటుంది 
సువాసనలనే ఇస్తుంది 

మొగలి గులాబి సంపంగి 
మల్లెల సెంటు సివంగి 
వాసన చూస్తే భలే పసందు 
ముక్కుకు చేయును మంచివిందు 

గాజు సీసాలో మెరుస్తుంటుంది 
అందరి మనసులు దోస్తుంటుంది 
అత్తరు సీసా చాలా అందమైనది
రాజు పేదకు అవసరమే ఇది 

శుభలేఖలకు పూస్తారండీ 
శుభకార్యాలలో ముందండీ 
ఒక్క చుక్కైన చాలునండీ 
నాలుగు వీధులు పరిమళమండీ 

కనోజు నగరం పుట్టిల్లండీ 
ఖండాలన్నీ తిరిగిందండీ 
చెడ్డ వాసనలు పరారగునడి 
పరిసరాలన్ని పరిమళమండీ

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
అత్తరు సీసా సువాసనలు వెదజల్లుతూ అద్భుతంగా ఉంది.. అమాగారికి అభినందనలు 💐