నేర్పినవాడే....
గింజల నెలవు వెదికే
ఓపిక కూడా ఇచ్చాడు
గూడు వదలి వెళ్లి
కూడు వెదికి తెచ్చి
కూనలకు తినిపించే
సుళువు కూడా నేర్పాడు
రెక్కలు విప్పి ఎగరడం
నేర్పినవాడే
రెక్కల కింద పిల్లలను
కాపాడే తెలివి ఇచ్చాడు
చిన్ని ప్రాణుల బ్రతుకులోనే
ఎన్నో పోరాటాలు ఉంచి
అప్రమత్తత నేర్పినది
అంతర్యామి కాదా...
ఎన్ని కర్మల ఫలముగానో
ఇంత ఉత్తమ జన్మగా
మనిషిగా పుట్టించిన వాడు
మనుగడ నడిపించడా?
కలతలు వస్తే ముందుకు
కదిలిపోయే కరుణ చూపడా?
చిక్కులు పడిన జీవితాలను
చక్కగా సవరించడా?
నడిచే తెగువ చూపితే
చేయి పట్టి తోడవడా...
గెలిచే కసి కనిపిస్తే
గెలుపు చేరువ చేయడా?
నమ్మకమే దైవం
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి