తరాలపాటు గత చరిత్రను నిక్షిప్తం చేసి, సమాజ విలువల్ని సజీవంగా నిల్పేది సాహిత్యరంగమని ఉత్తమ ఉపాధ్యాయులు, సాహిత్యాభిమాని ఆర్.ఆర్.ఎమ్.కొండలరావు అన్నారు. కొత్తూరు రచయితల వేదిక పదిహేడో నెల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు సాహిత్యం దోహదపడిందని అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాహిత్యాభిమాని కరకవలస విజయకుమార్ మాట్లాడుతూ ఇతిహాస గ్రంథాలన్నీ మానవాళికి ఒక జీవన మార్గాన్ని నేర్పించాయని అన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు మాట్లాడుతూ సాహిత్యం చదవడం వల్ల భాషపై పట్టు సాధిస్తామని, నూతన పదజాలం వాక్య నిర్మాణం భావవ్యక్తీకరణ వంటి నైపుణ్యాలు మెరుగుపడతాయని అన్నారు. వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ కవి సమ్మేళనం జరిగింది. తిరుమలరావుతోపాటు, అధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు ఎ.దిలీప్ పట్నాయక్, కార్యవర్గ సభ్యులు పేరిశెట్టి రామచంద్రరావు, గజివిల్లి మోహనరావు, సల్ల మన్మధరావులు తమ తమ కవితలను వినిపించారు. వారి రచనలందు ఆంధ్రజాతికి జీవం వంటి వాడుక భాషా ఔన్నత్యం, వ్యాకరణ అంశాలు, సామెతలు, పద్యాలలో గల విలువలను కూడా ప్రస్తావించారు. అనంతరం ముఖ్య అతిథి ఆర్.ఆర్.ఎం.కొండలరావును, గౌరవ అతిథి కరకవలస విజయకుమార్ లను వేదిక సభ్యులు శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చం, సాహిత్య గ్రంథాలతో ఘనంగా సన్మానించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఘనంగా సన్మానించారు. తొలుత తెలుగు తల్లి చిత్ర పటానికి సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి, తదితర సభ్యులంతా పూలమాలాలంకరణ చేసారు.
చరిత్ర, విలువల్ని తరతరాలకు సజీవంగా నిల్పేదే సాహిత్యం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి