వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య!: - కొత్త విరిత


 ఉంది కదా అని వాడేయడం మనకు అలవాటైపోయింది భయ్య…
అవసరం ఉందా లేదా అని ఆలోచించడం మాత్రం మనకు "అవసరం" లేని పని!
చేతిలో ఫోన్ ఉంది కదా… రోజంతా స్క్రీన్‌నే చూడాలి,మెదడు ఉంది కదా… దాన్ని మాత్రం వాడాల్సిన అవసరం లేదుగా!
ఇంట్లో కారు ఉంది కదా… పక్క వీధికి కూడా కారులోనే వెళ్లాలి,నడిస్తే పెట్రోల్ ఆదా అవుతుంది… కానీ మన స్టేటస్‌కి ఏం అవుతుంది?
నీళ్లు వస్తున్నాయి కదా… ట్యాప్ తెరిచి వదిలేయాలి,
రేపు నీళ్ల కోసం క్యూలో నిలబడినా మనకే ఒక ట్యాంకర్ ఫస్ట్ బుక్ అయ్యే అదృష్టాన్నే నిందించాలి!
కరెంటు ఉంది కదా… ఖాళీ గదిలో కూడా ఫ్యాన్, లైట్ తిరగాలి,బిల్లు మాత్రం వచ్చాక “ఇంత ఎందుకు?” అని ఆశ్చర్యపడాలి!
టెక్నాలజీ పని సులభం చేయడానికి వచ్చింది,మనం మాత్రం సులభమైన జీవితాన్ని మరింత "అనవసరాలతో" నింపుకున్నాం!
ప్రకృతి ఇచ్చిన సొత్తు మన సొంతం కాదు భయ్య…మన తర్వాతి తరానికి మనం అప్పుగా తీసుకున్న సంపద.కానీ మన సిద్ధాంతం ఒక్కటే
“ఉంది కదా,ఉన్నంతవరకూ వాడేద్దాం!”
వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య,తర్వాతి తరానికి మిగిల్చినోడికే నిజమైన వాడకం తెలుసు,అన్న సంగతి మీకు తెలుసా!
#######################################
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super analysis
అజ్ఞాత చెప్పారు…
Excellent write up 👌 👌 👌
అజ్ఞాత చెప్పారు…
Good one 👏👏❤️
అజ్ఞాత చెప్పారు…
Good one👏🏻👏🏻👏🏻