జలపాతాల హోరు
పచ్చని సిరుల పైరు
పిల్లలంతా హుషారు!!
పిల్లలు తీసే ఉరుకులు
తూనీగలు పట్టి ఆటలు
పెద్దలు చేసే అదుపులు
వద్దని చెప్పే నీతులు!!
చింతపండు పులిహోర
రుచి అనిపించెను ఔర
నేతి బొబ్బట్లు భళిర
తిన్నారంతా కడుపార!!
సరదా సరదా ఆటలు
అంత్యాక్షరితో పాటలు
జ్ఞాపకాలుగా ఫోటోలు
విహారానికి చెప్పిరి వీడ్కోలు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి