శ్రీకృష్ణుడిని కేంద్రంగా చేసుకుని, స్వచ్ఛమైన ప్రేమతో, ఎలాంటి స్వార్థం లేకుండా సమర్పించుకునే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితియే బృందావన చిత్తం.
నిజమైన బృందావనం అంటే హృదయంలో వికసించే భక్తిభావం. ప్రపంచంలో ఏ మూల ఉన్నా, మనస్సును పూర్తిగా శ్రీకృష్ణుడికే అంకితం చేస్తే, ఆ స్థితిలోనే బృందావన చిత్తం వర్ధిల్లుతుంది.
నిర్మలమైన భక్తి
శ్రీకృష్ణుడి కోరికలు తీర్చే దేవుడిగా కాకుండా.. సొంత బిడ్డగా, ఆత్మీయ మిత్రుడిగా, ప్రేమికుడిగా, ప్రాణనాథుడిగా ఆరాధించడమే నిజమైన భక్తి.
నిష్కామ సేవ
"దీనివల్ల నాకేం లభిస్తుంది?" అనే ఆలోచన లేకుండా.. త్రికరణ శుద్ధిగా చేసే ప్రతి పనిని శ్రీకృష్ణుని సంతోషం కోసమే సమర్పించడం బృందావన జీవనానికి ప్రతిపదిక.
అంతరంగంలోనే బృందావనం
బృందావనం అంటే కేవలం ఉత్తరప్రదేశ్‌లోని ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.
శ్రీకృష్ణుడిని ఎల్లప్పుడూ స్మరిస్తూ, ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన కోసమే జీవించే హృదయమే అసలైన బృందావనం.
బృందావన చిత్తాన్ని ఎలా పెంచుకోవాలి?
నామజపం
నమ్రతతో, అత్యంత ప్రేమతో శ్రీకృష్ణుని దివ్యనామాలను ప్రతిరోజూ జపించాలి:హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే...హరే రామ హరే రామ...రామ రామ హరే హరే
కృష్ణ లీలల స్మరణ
శ్రీమద్భాగవతం, భగవద్గీతలతో పాటు వైష్ణవాచార్యుల గ్రంథాలను చదువుతూ, శ్రీకృష్ణుని దివ్యలీలలను మనస్సులో నిరంతరం ధ్యానించాలి.
భక్తుల సేవ
శ్రీకృష్ణుడికి చేసే సేవతో పాటు, ఆయన భక్తులకు ప్రేమతో చేసే సేవ కూడా ఈ బృందావన చిత్తాన్ని విశేషంగా పెంపొందిస్తుంది.
బృందావనం కేవలం ఒక ప్రాంతం కాదు.
అది ప్రేమ, భక్తి, వినయం, నిరంతర స్మరణ, సేవలు కలగలిసి వికసించే ఆధ్యాత్మిక మానసిక స్థితి.
మన ప్రతి ఆలోచన, మాట, చేత శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే సమర్పించిన ప్పుడు, మన హృదయమే నిజమైన బృందావనంగా మారుతుంది.
"కృష్ణుడు మన జీవితానికి కేంద్రబిందువైనప్పుడు, మనం ఎక్కడ ఉన్నా అక్కడే బృందావనం సాక్షాత్కరిస్తుంది."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి