ఏకాంతదీపశిఖ”: - మాణిక్యాలరావు పంచదార్ల
 

నింగినివీడిన
తారకవోలె
చిరుగాలిలో
చేరినపిలుపై
కరిగినకలలే
కనుగొనవా?
మౌనమే
నిరంతరజ్ఞాపకమా?
 
చీకటిముసిరిన
ఏకాంతంలో
ఎదలోరగిలే
దీపశిఖవై
తోడుగానిలిచిన
క్షణములివే
నీడగాసాగిన
పయనమిదే
వేదననేతీయని
గాయముగా…
 
మౌనపుభాషల
భావంనీవే
నిలిచిన
జ్ఞాపకరూపంనీవే
కదిలినకాలం
కాననిదా?
రాలినపువ్వుల
గంధంలా
వాలినసూర్యుని
వర్ణంలా
శూన్యమేనిత్యము
తోడుగారా…
కామెంట్‌లు