ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయని ఆర్ఆర్.ఎల్.కుమారి విద్యార్థులందరిచే ప్రతిజ్ఞ గావించారు. ఏనుగుల రక్షణకై పాటుపడి పర్యావరణ పరిరక్షణకై తోడ్పడుతామని విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేసారు. ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ హెరిటేజ్ ఏనిమల్ గా పిలువబడే ఈ ఏనుగు ఈ పుడమిపై పూర్వపు జాతుల నుండి వచ్చిన వారసత్వపు హక్కు కలిగియుందని అన్నారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న అడవుల నరికివేతలో ఏనుగులు బలై పోతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ఏనుగులు చెట్లు ఆకులు భుజించి దారిపొడవునా లద్దవేస్తూ పోతాయని, ఆ లద్దనుండి విత్తనాలు మొలకెత్తి అడవులు విస్తరించబడుతాయని గుర్తుచేసారు. అందువలన ఏనుగుల సంతతి నశిస్తే మానవాళికి ఎంతో నష్టం వాటిల్లునని అన్నారు. ఉపాధ్యాయని ఉప్పలపాటి ఆదిలక్ష్మి మాట్లాడుతూ 1992లో స్థాపించిన ప్రోజెక్ట్ ఎలిఫెంట్ లక్ష్యాలైన ఏనుగుల ఆవాసాలను కాపాడడం, మానవ వన్యప్రాణుల సంరక్షణలను తగ్గించడం, దంతాల వేటను అరికట్టడం వంటి అంశాలకై అందరూ కట్టుబడియుండాలని అన్నారు. ఉపాధ్యాయులు వై.వి.రమణ మాట్లాడుతూ గనుల తవ్వకాల వల్ల ఈ ఏనుగులు భయపడిపోతున్నాయని, ఆహారం కోసం ఇటీవల ఉత్తరాంధ్ర గ్రామాల్లో చొరబడుట దురదృష్టకరమని అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కుంకీ ఏనుగుల శిబిరాలను ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారని అన్నారు. ఉపాధ్యాయులు వెలగాడ రాము మాట్లాడుతూ మానవ ఏనుగుల సంఘర్షణలపై అవగాహన కల్పించేందుకు 2012నుండీ ప్రపంచ వ్యాప్తంగా ఇదే రోజున ఏనుగుల దినోత్సవం జరుపుట మిక్కిలి ముదావహమని అన్నారు. ఈ ప్రతిజ్ఞ బూనే కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముల్లు సుజాత, కె.అరుణకుమారి, కర్రి రమణ, సి.హెచ్. రాజేశ్వరరావు, పిల్లల దాలమ్మలు ప్రసంగించారు.
పాలఖండ్యాం పాఠశాలలో ఏనుగుల రక్షణకై ప్రతిజ్ఞ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి