ఇదేనా అసలైన స్వాతంత్య్రం : - -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా

 

శాస్త్ర సాంకేతికత పెరిగిందని
పురుషులతో సమానంగా మహిళలు 
అన్ని రంగాలలో ప్రతిభ చూపుతున్నారని
అభివృద్ధి పథంలో భరతావని ఉందన్నది ముదావహమే.

పర్యావరణ పరిరక్షణ లేక 
స్వార్థ సంకుచిత భావాలతో 
విచక్షణా రహితంగా పంచభూతాలను 
కలుషితం చేస్తు 
ఈర్ష్య అసూయ కులమత భేదాలతో 
నేటి సమాజ వ్యవస్థ 
అసమానతలు పోక 
ఎండిన డొక్కలతో పిడికెడు మెతుకులకోసం వెంపర్లాడే ప్రజలు 
వింతపోకడలతో ఆర్భాటాలకు పోయే జనం
విద్యా వైద్యం కూడా అందని ద్రాక్షగా మారిన వైనం 
తమ స్వార్థం కోసం ఉచిత పథకాలతో 
ఎదుగుతున్న ప్రజాప్రతినిధులు
ఇదేనా  మహనీయుల త్యాగ ఫలితంగా లభించిన స్వాతంత్ర్యం
ఇకనైనా భిన్నత్వంలో ఏకత్వం మా దేశమని
జాతీయ పతాకాన్ని వినీల గగనాన ఎగురవేసి 
ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
ప్రతిన పూని వసుదైకానికే
ఆదర్శం నా దేశం అని చాటుదాం...!!
..................................

కామెంట్‌లు