సమాజహితమే నా హితమని
సనాతన ధర్మమే వసుదైకానికాదర్శమని
అలుపెరుగక మొక్కవోని ఆత్మవిశ్వాసంతో
భారత దేశ రాజకీయ చరిత్రలో
ప్రతిపక్షంలో ఉన్నా ప్రధానిగా పాలించినా
పార్లమెంట్ లో వాక్ చాతుర్యంతో
కవిహృదయంతో
అందరిమన్నలు పొందిన
నిష్కళంక నిజాయితీ గల
రాజకీయ నాయకులు
అటల్ బిహారీ వాజ్ పాయ్
మీరు ప్రజల మదిలో చిరస్మరణీయులు
కాంగ్రేసతర మొదటి ప్రభుత్వం జనతాపార్టీలో మొరార్జీ నేతృత్వంలో
విదేశాంగ శాఖా మంత్రిగా మీ అద్భుతమైన పనితీరు
ప్రోక్రాన్ అణు పరీక్షతో ప్రధానిగా
భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో
అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టి
స్త్రీ సంక్షేమ అటల్ యోజన
రోడ్ల విస్తరణ వంటి
అనేక పథకాలతో
ప్రజాసంక్షేమం కోసం జీవితాంతం శ్రమించి
భగవద్గీతలో స్థితప్రజ్ఞతకు దర్పణంగా నిలిచిన
మీకు భారతరత్న పురస్కారానికే వన్నెతెచ్చిన భరతమాత మణిరత్నమే
అందుకోండి అజాతశతృవు అటల్ బిహారీ వాజ్ పాయ్ గారు
మీ కివే నా అక్షరాంజలులు..!!
.................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి