సుప్రభాత కవిత : - బృంద


అందమైన లోకానికి 
అతిథి గా వచ్చాను 
ఆణువణువూ పులకరించి 
పరవశించి పోతున్నా....

వెల్లువైన వెలుతురులో 
వెలుగుతున్న పరిసరాలు 
వేకువ తెచ్చిన  కాంతులు 
వేడుకగా చూస్తున్నా...

తెలివెలుగుల కిరణపు 
నులివెచ్చని స్పర్శ తాకి 
తెరచిన రెక్కల రెప్పల 
పరిమళం పంచుతున్నా.....

చక్కని ప్రకృతిలో....
ఒక్కటిగా నిలిచిన 
మొక్కకు పాపగా పుట్టి 
మక్కువగా అంటివున్నా....

ప్రభవించిన  ప్రభువు 
ప్రేమ చూపు తీరును 
ప్రవహించు నీటిపైన
ప్రసరించు కాంతిలో చూస్తున్నా

గాలికి ఊగుతూ హాయిగా 
నీటికి వీడుకొలు చెబుతూ 
నీరెండను అనుభవిస్తూ 
మనసారా నవ్వుతున్నా.....

ఈ ఆనందపు ఛాయలు 
ఈ సంతోషపు  భావాలు 
ఈ జన్మకు చాలునని 
మిక్కిలి  తృప్తికి రూపమైన 

పూబాల అనుభూతికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు