ప్రగతి దారుల పయనిద్దాం: - బి.ఉషారాణి-Govt టీచర్- మంచిర్యాల


పుణ్యభూమి ధన్యభూమి,
కర్మభూమి ధర్మభూమి
నా జన్మభూమి,
నా భారతమాత ఖ్యాతి
నలుదిశలా వ్యాప్తి చెందేలా,
ఎగరాలి మువ్వన్నెల కేతనం.
గగనవీధుల్లో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ,
విశ్వానికి శాంతి సందేశం అందిస్తూ...

ఎందరో వీరుల త్యాగఫలమై
అందిన స్వాతంత్య్రం ఇది,
నిలుపుకోవలసిన బాధ్యత మనందరిది.

సమానత్వ భావన పెంపొందేలా,
పేదరికం అంతరించేలా,
ఐకమత్య భావన బలపడేలా,
అవినీతి రహిత రాజ్య స్థాపనే లక్ష్యంగా,
చేయి చేయి కలిపి మనం సాగుదాం.

దేశ ప్రగతే మనందరి ఆశయంగా,
నవభారత నిర్మాణమే మన ధ్యేయంగా,
శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా,
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా,
ప్రగతి దారులలో మనం పయనిద్దాం.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Well said.Rightly Narrated
అజ్ఞాత చెప్పారు…
Super
అజ్ఞాత చెప్పారు…
👌👌
అజ్ఞాత చెప్పారు…
👌👌👌
అజ్ఞాత చెప్పారు…
Nice