ప్రకృతి విధ్వంసరచనకే పూనుకున్నావా
ప్రాణికోటికి ఆలవాలమైన ఈ అవనిని
నిర్జీవంగా మార్చాలనే నిర్ణయించుకున్నావా
పచ్చని తరులపై విరిసిన విరులతో అలరారుతూ
స్వచ్ఛమైన ప్రాణవాయువునొసగే పుడమిని
నేడు కాలుష్యపు కోరలలో బంధిస్తున్నావా
జీవవైవిధ్యాన్ని చేజేతులారా నాశనం చేస్తున్నావా
ఆహ్లాదాన్ని పంచిన ఆనాటి పల్లెటూళ్ళను
నేడు గ్రామాలుగా, పట్టణాలుగా మార్చి
ప్రగతి పేరుతో, పరిశ్రమల స్థాపనతో
మురికి కూపాలుగా మార్చివేస్తున్నావా
ప్రాణుల ఆరోగ్యం, ఆయుష్షును హరించే
అభివృద్ధి వైపా నీవు అడుగులు వేస్తోంది
జీవకోటి మనుగడకు ముప్పు తెస్తున్న
నీ నడకనా పరుగులా మార్చుకుంటున్నావు
ఆలోచించు ఓసారి నీ మేథతో ఓ నరుడా
ప్రకృతి పరిరక్షణ దిశగా ఏ అడుగు వేయాలో
నీవు తప్ప ఏ చిన్ని కీటకమయినా చేస్తోందా
ప్రకృతి వినాశనం అని నీ మదిలో ప్రశ్నించి
జీవి నివాసానికే ముప్పుగా పరిణమించేలా
తల్లి భూమాతను నీవు మారుస్తూ పోతుంటే
నీ ఉనికే మునుముందు ప్రశ్నార్థకం కాదా
నీ చేయి నీ తలపై భస్మాసురహస్తమవదా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి