మూడు రంగుల జెండా...
మా గుండె నిండా...
నిండినది నీ రూపమే...
ఓ భారతమాతా...!
జై హింద్ నినాదమే...
మా ప్రతి శ్వాస...
జన్మభూమి సేవయే ...
మాకున్న ఆశ...!
చరణం - 1:
మహనీయుల అడుగులతో సాగిన చరిత్ర ఇది,
వీరుల త్యాగాలతో వెలిగిన దీపమిది.
బానిస సంకెళ్లను తెంచిన ధైర్యమిది,
స్వేచ్ఛయను సూర్యుడే తెచ్చిన వెలుగు ఇది.
చరణం - 2:
ఈ నేలపై పుట్టడం మా పూర్వ పుణ్యము,
ఈ జెండా నీడలో బతకడమే భాగ్యము.
చివరి శ్వాస వరకూ జై హింద్ నినాదము
దేశభక్తి మార్గంలో సాగేటి పయనము
కోట్లాది గొంతుకల ఒకే ఒక గానము...
భరతమాత పాదాలకే మా నిండు ప్రణామము...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి