బరువెంతయినా మోస్తుంది
విభేదాలు తనకు లేవంది
భేద భావాలు చూపనిది!!
మీరకుండా మర్యాద
తలుపు మూయమని రొద
పిల్లలకిచ్చును సరద
అందరికీ అది నేస్తం కద!!
హర్మ్యాలలో దర్శనం
అలుపెరగని పయనం
కష్టజీవిగా జీవనయానం
అందలానికి పర్యాయం!!
సోపానాలు లేనిది
కాళ్ల నొప్పులు రానిది
విద్యుత్ ఒకటే కోరేది
తనతో ఆటలు తగదంది!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి