అదృశ్య వీరుడు 1️⃣✅బాగము:-నాగమణి రావులపాటి.
శ్రీ వినాయకాయనమః
ఓం శ్రీ గురు సాయి నాధాయ నమః



పూర్వం సౌవీర రాజ్యాన్ని శివదత్తుడు అనే
రాజు పరిపాలించేవాడు. శివదత్తుడు చాలా
సహనశీలి దయార్ద హృదయుడు. ప్రజలను
కన్న బిడ్డల వలె చూసుకుంటూ అందరి
హృదయాలలో రాజు వలే కాక ఒక మిత్రుని
లా నిలిచాడు .........!!!

అన్నీ వున్నా దైవం మనిషికి....
ఏదో ఒక అసంతృప్తి మిగుల్చుతాడు. అది
రాజు అయినా బంటు అయినా. ఆమహా
రాజుకు సంతాన యోగం లేకుండా చేసాడు.
రాజు శివదత్తుడు మహారాణి సుదేష్ణ బాధ
పడని రోజు లేదు.........!!!

 ఆరాజదంపతులు సంతాన భాగ్యం
 కలగాలని ఎన్నో పూజలు వ్రతాలు చేసారు.
  బావులు చెరువులు తవ్వించారు. సత్రాలు కట్టించారు. అన్నదానాలు చేసారు......
 దేవాలయాలు నిర్మించారు........!!!

అన్నమో రామచంద్రా అనేవాళ్ళు లేకుండా
దేశాన్నిసుభిక్షంగా సస్యశ్యమలంగా వుంచేందుకు
తగిన ఏర్పాట్లు చేసారు. అయినా వారికి
సంతాన లోపం లోపంగానే మిగిలింది...!!!

రాజు శివదత్తుడు ఆలోచనలతో కృంగి
పోవటం చూసి మంత్రి వర్యుడు సుబుద్ది
రాజ పురోహితుని ఆహ్వానించి తోడ్కొని
రమ్మని బటుడితో వర్తమానం పంపాడు..‌!!!

ఆ వర్తమానం అందుకొన్న రాజ పురోహితుడు
సుసేనుడు శీగ్రమే రాజ మందిరానికి వేంచే
సాడు..సెలవీయండి మంత్రి వర్యా... నన్ను
రమ్మన్న కారణం అని మంత్రి సుబుద్దితో
అన్నాడు..........!!!

 మీకు తెలియంది ఏముంది  పండితోత్తమా!
 మన మహారాజు శివదత్తుల వారు
సంతాన లేమితో కృంగిపోవు చున్నారు.
ఏదైనా ఉపాయం సూచిస్తారని మిమ్ము
రమ్మంటిమి. దీనికేదన్నా తరుణోపాయం చెప్పి
మహారాజుకు ఈరాజ్యానికి ఆనందం 
కలిగిచాలని మనవి పండిత వర్యా.......!!!

అని విన్నవించు కున్నాడు అమాత్యుడు సుబుద్ది.
చిత్తం  మంత్రి వర్యా  మహారాజు సమక్షంలో
విన్నవిస్తాను శివదత్తులను పిలిపించండి.
ఈలోగా శాస్త్రం తిరగేసి తగిన తరుణో
పాయం సూచిస్తాను అని పలికాడు సుసేనుడు (సశేషం)..........!!!
కామెంట్‌లు