109వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
జాబాలి  నాస్తికవాదమును ఖండించుచు శ్రీరాముడు సత్యము  వైశిష్ట్యమును పేర్కొనుట 




శ్రీరాముడు జాబాలి మాటలను విని 
తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి 
వేద శాస్త్రములప్రమాణ దృష్టితో ఇట్లు దెలుపును
ఓ విప్రోత్తమా నన్ను సంతోష పెట్టుటకై 

నీవు కొన్ని మాటలను నాతో పలికితివి 
అవి కర్తవ్యములుగా కనిపించవచ్చు
వాస్తవముగా అవి చేయదగనివని 
హితముతో భావించుచున్నాను 

నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకొనినచో 
నేను ధర్మము తప్పిన వాడ నైతాను 
అప్పుడు ఈ లోకమంతయు అట్లే ప్రవర్తించెదరు 
రాజుల ప్రవర్తనే ప్రజలు పాటించెదరు.

దానధర్మములు, యజ్ఞములు, 
హోమకార్యములు, వ్రతములు, 
తపస్సులు వేదములు అన్నియూ
సత్యము పైననే ఆధారపడి యున్నవి 

ఈ సత్యరూప ధర్మములు ఎల్లరకు 
శ్రేయోదాయకమనియు ధర్మములలో
శ్రేష్టమైనదనియు త్రికరణ శుద్ధిగా నమ్ముదును 
జటవల్కములను దాల్చి తాపసధర్మముననుసరించెదను.

కామెంట్‌లు