1801_1802 ,ప్రాంతంలో త్యాగయ్య గొప్ప గాయకునిగా వెలుగులోకి వచ్చాడు.తంజావూరు పాలకుడు శరభోజీమహారాజు సంగీతప్రియుడు.ఆయన ఆస్థానంలో 364మంది గాయకులుండేవారు. ఏడాదిపొడుగుతా రోజుకొకరు గానం చేసేవారు.ఆఏడాదికి సరిపడా గ్రాసాన్ని రాజు ఇచ్చేవాడు.నారాయణతీర్ధులవారి శిష్యుడైన శొంఠి వేంకట సుబ్బయ్య గారు తంజాపురాస్థానవిద్వాంసులు.ఈయన కొడుకు వేంకట రమణభాగవతులు త్యాగయ్య కి గురువు. ఆయన ఆజ్ఞతో త్యాగయ్య బిలహరిరాగంలో" దొరకునా ఇటువంటి సేవ" కీర్తనను కొన్నిగంటలుపాడటం విశేషం! గురువు ఆనందంతో రాజు ఇచ్చిన ఆభరణంని త్యాగయ్య కి ఇస్తే తీసుకోవడానికి తటపటాయించాడు. గురువుగారి కూతురిపెళ్లికి ఇంకా కొన్ని చేర్చి వధువుకివ్వాలని నిర్ణయించుకొన్నాడు. గురువుతో కల్సి తంజావూరు రాజప్రాసాద ఉత్సవంలో కాంభోజీ రాగంలో , " మరిమరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు కరిమొరవిని సరగున చన నీకు కారణమేమి
సర్వాంతర్యామి" అని 8 గంటలు త్యాగయ్య పాడారంటే నమ్మబుద్ధికాదు.ఆయన పాటకు ప్రేరణ భక్త పోతన భాగవతం!1802 లో శరభోజి తన రాజోద్యోగిని పంపాడు .35ఏళ్లత్యాగయ్య నిరాకరించటం అన్న జప్యేశునికి సంతోషం కలిగించింది.దరిద్రంపోతుందని సుఖభోగాలను పొందాలనే అన్న ఆరాటంకి గండికొట్టాడుత్యాగయ్య.శరభోజీ తనపై రెండు కీర్తనలురాసి పాడమంటే బాధ పడ్డాడు త్యాగయ్య. "పదము త్యాగరాజ నుతునిపై కానిది పాడేమి ఏడ్చేమి" అన్నది ఆయన సిద్ధాంతం!
కల్యాణి రాగంలో కుండబద్దలు కొట్టారాయన" నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగబల్కు మనసా....మమత బంధనయుత నరస్తుతి సుఖమా?సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా?" అద్భుతంగా ఆలోచన లో పడేసే కృతి అది! అన్న విసుగు చిరాకు పట్టించుకోని వైరాగ్యసంపన్నుడు!
మణిరంగురాగంలో, " రానిది రాదు సురాసురులకైన..పోనిదిపోదు భూసురులకైన" అంటూనే దేశికతోడిరాగంలో"రూకలు పదివేలున్న చేరెడునూకలుగతిగానీ
కోకలు వెయ్యున్నా కట్టుకొనుటకొకటే గాని ఓమనసా...సారతరుని హరిని త్యాగరాజ సన్నుతుని మరవకే మనసా" ఎప్పటికీ అందరికీ నీతి చెప్పే దిక్సూచి!రంజని రాగంలో"దుర్మార్గ చరాధముల దొర నీవన జాలరా! ...ఖలుల నెచట బొగడని శ్రీకర త్యాగరాజ వినుత" అంటూ తెగేసి చెప్పాడు. సారమతి రాగంలో"మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకూ" అని,ఛాయాతరంగిణి రాగంలో "కృపజూచుటకు వేళరా రామ
ప్రభువు లెల్లనీచ సేవకులురా"...గౌళిపంతు రాగంలో" కాసిచ్చేదే గొప్పాయెనురా కలిలో రాజులకు..హరిదాసులు సేవింపరనుచు ప్రభువులు దయమానిరి" అని నిలదీశాడు. బేగడరాగంలో" గట్టిగాను నను చెయి బట్టే దెన్నటికో ...మెప్పులకాసించే యా చప్పని ప్రభువుల కడకును త్రిప్పుటలేలరా?" అని దైవాన్ని అడిగాడు.🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి