త్యాగరాజు రామదర్శనం 11వభాగం: -మూలం...డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి-సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
 

శరభోజీకి త్యాగయ్య పై కోపం ముంచుకొచ్చింది. ఆయన్ని బంధించి తెమ్మని  ఇద్దరు గుర్రపు రౌతులను పంపాడు.అంతే శరభోజీకి శూలవ్యాధి ప్రారంభమైంది.తన అపచారం గ్రహించిన రాజు వారిని వెనక్కి పిలిపించటం, రోగం ఠక్కున తగ్గడం రాముని లీల! శరభోజీ స్వయంగా తిరువయ్యూర్ వెళ్లి త్యాగయ్య ను క్షమాపణ వేడాడు. సకుటంబంగా అక్కడకెళ్లి త్యాగయ్య గానం వినటం కోసం కల్యాణ మహల్ ని త్యాగయ్య ఇంటి సమీపంలో కట్టించాడు.ఇప్పుడు త్యాగబ్రహ్మ ఆరాధన సభ కార్యాలయంలో తాళపత్రం పై చేతిరాత  త్యాగరాజులవారిదే!
ఒకసారి శరభోజీ ఆదేశంతో, అతని మనుషులు త్యాగయ్య  తలపై ఉండే అక్షయపాత్ర లో బంగారునాణాలు వేశారు.అది గ్రహించిన త్యాగయ్య  వెంటనే అక్షయపాత్ర ని క్రింద బోర్లించి ,ఖాళీచేసి  ఉంఛవృత్తికి తిరిగి బయలుదేరారు.రాజు వేయించిన నాణాలవలన బియ్యం అపవిత్రమైందని భావించిన ఆత్మాభిమాని మహాభక్తుడు!
రాజు ఆహ్వానంని తిరస్కరించినందుకు ఆయన తల్లి సంబరపడింది.అన్న జప్యేశుడు కోపంతో రగిలిపోయి తమ్ముడు పూజించే  రామపీఠాన్ని 60గజాలదూరంలో ఉన్న  కావేరీ లో పారేశాడు. తెల్లారి విగ్రహాలు కన్పడక త్యాగయ్య  స్పృహ కోల్పోయారు.
"నేనెందు వెదకుదురా హరి 
ఆనాల్గు మోములవాని మొరనాలకించి రాని నిన్ను
ఎందు దాగినాడో  ఈడకురానెన్నడు దయవచ్చునో  ఓమనసా?" అని ఆర్తితో  వగచాడు. జీవితం దుర్భరంగా తోచిన ఆయన  కొద్దిరోజులు  మేనత్త కొడుకు ఇంట,కొద్దికాలం తిరువారూర్ లో ఉన్నాడు.
నిష్ఠూరంగా ఇలా వేడాడు ఆయన " అడిగి సుఖము లెవ్వరనుభవించిరిరా? ఆశ్రయించి వర్ణించిన సీత యడవికి బోనాయె...వాసిగ నారదమౌని వరమడుగ వనితరూపుడాయే"...." చేసిన దెల్లమరచితివో ఓ రామరామ...నేపొగడకుంటే నీకేమి కొదవో..నీమనసు తెలిసెగదరా ఓరామా!"" ఎందుకీ చలము నేనెవరితో దెల్పుదు..కందర్పజనక నీకే కాంత చెప్పెనో హరి హరి... తారకనామా త్యాగరాజ నుత దయతో నేలుకోరా..."పలుకవేమినా దైవమా,పరులు నవ్వేది న్యాయమా?"( రాగాలు తెల్పలేదు శ్రీశాస్త్రిగారు.కొన్ని కీర్తనలు మాత్రమే గాయకులు పాడుతారు). నాకు బాగా తెలిసిన ప్రసిద్ధ కృతి అభేరీ రాగంలోని" నగుమోము గనలేని నా జాలి దెలిసి నను బ్రోవగ రాదా శ్రీరఘువర" లో" ఖగరాజు నీయానతి విని వేగచనలేదో  గగనానికిలకు బహుదూరం బనినాడో...జగమేలే పరమాత్మ  ఎవరితో మొరలిడుదు ..నన్నేలుకోరా త్యాగరాజనుత " చాలా ప్రసిద్ధిగాంచిన కీర్తన. (శ్రీమతి భానుమతిరామకృష్ణ సినిమాలో స్వయంగా పాడిన గుర్తు). కానీ చెంబై, ముసిరి ,మధురై మణిఅయ్యర్ లగాత్రాల్లో  త్యాగయ్య కృతులు చాలా బాగా రేడియోలో ప్రసారం అయ్యేవి.అరియక్కుడి ఎం.ఎల్ వసంత కుమారి,రాధాజయలక్ష్మిగార్లగాత్రాలు బాల్యంలో విన్న జ్ఞాపకాలు)3 నెలలతర్వాత రాముడు కలలో కన్పడి "కావేరి  రేవులో ఉన్నాయి తీసుకో" అని చెప్పటం ఆలస్యంఆనందంతో పరుగులు పెట్టింది ఆయన మది.1805 లో జరిగింది ఈసంఘటన! " రార మాఇంటిదాకా రఘువీర సుకుమార మ్రొక్కేరా"(రాగం చెప్పలేదు శాస్త్రిగారు) అంటూ " కనుగొంటినీ శ్రీరాములు నేడు ఇనకులమందు ఇంపుగాను బుట్టి" అని కీర్తించారు.కానీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఇలా గానం చేశారు" కనుగొంటినీ శ్రీరాముని నేడు కనులార నా కామితము తీర" అని పాడేవారు.🌷
కామెంట్‌లు